ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన సిఫారసు లేఖల పరిష్కారంపై నివేదికలు అందజేయాలి

 

జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 10 (ప్రజాబలం)కొత్తగూడెం సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిద ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినుతులు స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన 56 లేఖలు పెండింగ్ ఉన్నాయని, ఆయా శాఖల అధికారులు బుధవారం వరకు పరిష్కరించి నివేదికలు అందచేయాలని చెప్పారు. ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.

సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో చేసిన ధరఖాస్తులు కొన్ని::-

సుజాతనగర్ మండలానికి చెందిన తోకచిచ్చు సీతారామరాజు సర్వే నెం.1497/ఈ/ఇ/2లో 2.09 ఎకరాల భూమి ఉన్నదని, అట్టి భూమికి సంబంధించి మాకు పూర్తి అధికారాలున్నాయని, భూమి తక్కువగా ఉన్నట్లు తమకు అనుమానాలున్నాయని, సర్వే చేపించాలని చేసిన ధరఖాస్తును తగు చర్యలు కొరకు సుజాతనగర్ తహసిల్దార్కు ఎండార్స్ చేశారు.

బూర్గంపాడు మండలానికి చెందిన వంగూరి అరుణ, వంగూరి కామేశ్వరి డిగ్రీ వరకు చదువుకున్నామని, ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కష్టంగా ఉన్నదని, తమకు దళితబంధు పథకం మంజూరు చేపించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఎస్సీ కార్పోరేషన్ ఈడికి ఎండార్స్ చేశారు.

చుంచుపల్లి మండలం, రాంనగర్ గ్రామానికి చెందిన దామెర్ల వేణుమాధవ్ హైదరాబాదు నందలి నల్లమల్లారెడ్డి గటికేసర్, హైదరాబాదు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేరియున్నానని, కరోనా వల్ల తరగుతులు నిర్వహణ సరిగా లేకపోవడం, తెలుగుమీడియం నుండి వచ్చిన తాను ఇంగ్లీషు మీడియంలో విద్యను అభ్యసించలేకపోవడం వల్ల మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని, ఇంజనీరింగ్ విద్య అభ్యసించలేనని, తన సర్టిఫికేట్లు ఇప్పించాలని కోరగా, మిగిలిన మూడు సంవత్సరాల ఫీజులు చెల్లించాలని చెప్పారని, ఫీజులు చెల్లించలేని ఆర్ధిక పరిస్థితుల్లో ఉన్నామని తన సర్టిఫికేట్లు ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు కలెక్టరేట్ ఓఎస్టీకి ఎండార్స్ చేశారు.

పాల్వంచ మండలం, మంచికంటి నరగ్కు చెందిన నునావత్ శ్రీరాం మంచికంటినగర్ లోని ముత్యాలమ్మ గుడి దగ్గర నాలుగు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నానని, విద్యుత్, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని. కావున విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు.

అన్నపురెడ్డిపల్లి మండలం, తొట్టిపంపు గ్రామానికి చెందిన వసంతరావు మరి కొందరు గిరిజన రైతులు గత 20 సంవత్సరాలుగా ఆర్ఎస్ఆర్ భూముల్లో వ్యవసాయం సాగు చేస్తున్నామని, నీటి సౌకర్యం కొరకు సోలార్ ద్వారా బోర్లు వేసుకున్నామని, అట్టి ఆర్ఎఎస్ఆర్ పట్టా కలిగిన భూముల్లో ఆయిల్పమ్ సాగు చేయుటకు ప్రభుత్వ రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు ఇప్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఉద్యాన అధికారికి ఎండార్స్ చేశారు.

ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking