భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 10 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, నాచారం గ్రామంలో వేంచేసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహాస్వామి జగదాంబసమేత జయలింగేశ్వరాస్వామి వార్ల దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర గవర్నర్ ప్రైవేట్ కార్యదర్శి భవాని శంకర్ జిల్లా కలెక్టర్ అనుదీప్కు ఆహ్వాన పత్రికను అందచేశారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కలిసి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందచేశారు. వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలను విశ్వకళ్యాణార్థమై సర్వజనుల రక్షణ కోసం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆయన సూచించారు.