సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యం కల్పించాలి

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ ఖదీర్
నల్లగొండ టౌన్, జూన్ 16: ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కు లాలకు సామాజిక వర్గాల ప్రకారం రాజకీయ రంగంలో తగిన ప్రాతి. నిధ్యం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ ఖదీర్ డిమాండ్ చేశారు. సంఘ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దే శంలో 56శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంత వరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం లేదని ఆరోపించారు. రాజ్యాధికారంతోనే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉద్యోగం లభిస్తుందన్నారు. పేదలకు రా జ్యాధికారం వచ్చిన రోజు కష్టాలు ఉండవన్నారు. బీసీ బిల్లును ప్రవే శపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking