గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

 

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 18:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ గౌతమ్ ముందస్తుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ భావం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని అందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు అందరూ సమన్వయంతో చేయాల్సిందిగా సూచించారు. దీంతో పాటు గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ, పోలీసు గౌరవ వందనం కార్యక్రమాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని తెలిపారు. అలాగే కలెక్టరేట్ ఆవరణలో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణ విషయాలపై సంబంధిత మున్సిపల్ కమిషనర్కు అవసరమైన సూచనలు చేశారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వేదికను అందంగా పుష్పాలంకరణతో అందంగా ఉంండేలా చేయాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథులకు గణతంత్ర దినోత్సవ ఆహ్వానపత్రాలను అందచేయాలని కలెక్టర్ గౌతమ్ సమావేశంలో అధికారులకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించే కార్యక్రమాలను రెవెన్యూ శాఖ పర్యవేక్షించాలన్నారు. జిల్లా ప్రగతి పై రూపొందించే కాపీ ఏర్పాట్లను సీపీవో ఆధ్వర్యంలో తయారు చేయాల్సిందిగా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. జాతీయ భావం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను విద్యాశాఖ అధికారులు చేపట్టాలన్నారు. అలాగే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో పాటు అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారికి కలెక్టర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యుత్తు సరఫరాకు ఎలాంటి అంతరాయం, ఆటంకం లేకుండా సంబంధిత విద్యుత్తు శాఖ అధికారులు ఇప్పటి నుంచే మరమ్మతులు, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్తు శాఖ జిల్లా అధికారికి సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రికలు ముద్రించి అతిథులకు, స్వాతంత్ర్య సమర యోధులను ఆహ్వానించి వారికి ఆతిథ్యం అందించాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఇప్పటి నుంచే ముందస్తుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసుకోవాలని కార్యక్రమం విజయవంతమయ్యేలా అందరి సహకారంతో పని చేయాల్సిందిగా కలెక్టర్ గౌతమ్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీవోలు రాజేష్ కుమార్ శ్యామ్ ప్రకాశ్, జిల్లా కలెక్టరేట్ ఏవో రామ్మోహన్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking