సమస్యలు పరిష్కరించాలని వినతి

– కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్‌ను కలిసిన నాయకులు
వీణవంక ప్రజాబలం ప్రతినిధి జూలై 16

వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం గ్రామ నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ను మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. గ్రామానికి సీసీ రోడ్లు, వీధి లైట్లు కావాలని కోరారు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. గ్రామంలోని అర్హులైన వారికి పింఛన్లు, కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని ప్రణవ్‌ను అడిగారు. ఈ సమస్యలపై ప్రణవ్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాసారపు ప్రభుదాస్, మద్దుల ప్రశాంత్, దాసారపు రాకేష్, ఇసాక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking