ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లానిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వార్డు నెంబర్ 39 పరిధిలోని గుల్జార్ మార్కెట్,ఖిల్లా గుట్ట ప్రాంతాలలో ఎదురవుతున్న సమస్యలను తెలియజేస్తూ నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ కు కలెక్టర్ కార్యాలయంలో సామాజిక వేత్త శేఖ్ ఇంతియాజ్ అహ్మద్ స్థానికులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రంలో స్థానికంగా పురపాలక శాఖ ద్వారా మంచినీటి కుళాయిలకు నీటి సరఫరా సకాలంలో జరగడం లేదన్నారు. పురపాలక శాఖ ద్వారా స్థానికులు అందరికీ మున్సిపల్ బోర్డు నుంచి నీటిని సరఫరా చేయవలసి ఉండగా కొంతమంది స్థానికులకే ఆ వాటి నీళ్ళు అందేలా అంతర్గత కనెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. వీటి కనెక్షన్లను వెంటనే వాటర్ సిస్టన్ లకే ఇవ్వాలని కోరారు. అదేవిధంగా అద్వానంగా మారిన రోడ్లను సరి చేసేలా కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికంగా చారిత్రాత్మక గుట్ట ప్రాంతం కావడంతో కోతులు కుక్కల బెడద పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉండడంతో స్థానికులు చిన్నపిల్లలకు బయటికి పంపడానికి భయాందోళనల మధ్య కాలాన్ని వాసులు వేలాదిస్తున్నారని వీటిని నివారించేందుకు కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా పాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీల ద్వారా లబ్ధి పొందేందుకు చేసిన దరఖాస్తులలో 70% మందికి వాటి ఫలాలు సకాలంలో అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంలో కూడా చర్యలు తీసుకొని తమ వీధి వాసులకు న్యాయం చేయాలని కోరారు