ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 05 (ప్రజాబలం) ఖమ్మం త్రీ టౌన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి వద్ద సీఎం కేసీఆర్ కి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గచిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఖమ్మం మున్నేరు కు ఇరు వైపులా ఆర్.సి.సి వాల్ నిర్మాణ కోసం ప్రభుత్వం 690 కోట్ల రూపాయిల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషిని కొనియాడారు. దశాబ్దాలుగా ఖమ్మం త్రీ టౌన్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మున్నేరు వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఆర్ సి సి వాల్ నిర్మించడంపై వారు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి, మంత్రి పువ్వాడ కు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ కార్పొరేటర్ తోట వీరభద్రం స్ధానిక ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.