జర్నలిస్టుల ఫోరం మెదక్ జిల్లా
ఉపాధ్యక్షులు గడ్డం ప్రశాంత్ కుమార్.
మెదక్ సెప్టెంబర్ 5 ప్రజా బలం న్యూస్ :-ఈనెల 6 న తేదీన హైదరాబాద్ లో జరుగు మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం ద్వితీయ ప్లీనరీ సమావేశానికి జిల్లాలో పనిచేస్తున్న మున్నూరు కాపు జర్నలిస్ట్ సోదరులు భారీ ఎత్తున తరలిరావాలని మెదక్ జిల్లా జర్నలిస్టు ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం ప్రశాంత్ కుమార్ పటేల్ సోమవారం ఒక ప్రకటనలొ కొరారు.అయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మున్నూరు కాపు జర్నలిస్టుల హక్కుల సాధనకై ఈ ప్లీనరీలో జరిగె ప్రస్తుతం ప్రధాన సమస్యలైన, ఇండ్ల నిర్మాణం, హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు, ఇన్సూరెన్స్, కార్పొరేషన్ ఏర్పాటు, పాత్రికెయులపై అక్రమ కెసులు,దాడులపై పలు తీర్మానాలపై చర్చించనున్నాట్లు అయన తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులకు రావాల్సిన మోలిక సదుపాయాలు తీసుకురావాలని ఈ సభలో తీర్మానం చేయడం జరుగుతుందనిఅయన పేర్కొన్నారు. తెలంగాణలో ముమ్నుర్ కాపు పాత్రికేయులు 5000 పైచిలుకు విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు తమ హక్కులను సాధించుకోవాలని అయన జర్నలిస్టు లను కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.