బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ అయిన మరునాడే ఖమ్మం జిల్లాలో రాజీనామాల పర్వం మొదలైంది. దానిలో భాగంగా పొంగులేటి వర్గం నాయకులు మాజీ జెడ్పిటిసి, ప్రస్తుత డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తడిగుడ్డతో గొంతు కోసినట్లుగా, నమ్మకద్రోహంతో బిఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనన్నను ఉపయోగించుకున్నన్ని రోజులు ఉపయోగించుకుని, ఆయన ద్వారా రాజకీయ లబ్ధి పొంది సస్పెండ్ చేసిందని అన్నారు. అలాంటి వ్యక్తిని అవమానించినందుకు గాను, బాధాకరంగాఉన్నదని, ఆయన వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల ముందు దోషి గా నిలబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కెసిఆర్ పెట్టిన దళిత బంధు, నిరుద్యోగ భృతి,డబుల్ బెడ్ రూమ్ ఎక్కడ అమలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో చేరాయని విమర్శించారు. ఆయనతోపాటు మత్స్యశాఖ సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, మాజీ ఉప సర్పంచ్ ధరావతులాలు, మాజీ వార్డ్ మెంబర్లు బండి ఉపేందర్, ప్రస్తుత వార్డు మెంబర్ బానోతు లక్ష్మ నాయక్ చల్ల మల్లయ్య, చింతల పెద్ద వెంకయ్య, బాదావత్ నాగరాజు, రాయల నాగ శంకర్, పగిడిపల్లి రాములు, బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking