-హెచ్ఎంఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె. శ్రీనివాస్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 17 :
సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికులకు రెస్ట్ హాల్స్ ను ఏర్పాటు చేయాలని హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జై శ్రీనివాస్ కోరారు. మంగళవారం స్థానిక హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సింగరేణి సంస్థలో 36 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ పొందిన కార్మికులు
దిగిపోయిన తరువాత ఎక్కడెక్కడో వారికి వీలున్నచోట కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ లాంటి ఎన్నో ఊర్లలో వారికి వీలున్నచోట్లలో జీవనయానం కొనసాగిస్తున్నారన్నారు.
ఇటువంటి తరుణంలో వారు ఆరోగ్యరీత్యా , కంపనీకి వారి ఐడెంటిటీ చూపేరీత్యా సంవత్సరంలో పలు దఫాలు వారు పనిచేసి దిగిపోయిన ఏరియాలకు రావలసివస్తుందన్నారు.
అలాంటి పరిస్థితుల్లో వారు ఎక్కడ ఉండాలో తెలియని అయోమయపరిస్తితి నెలకొనిఉందన్నారు.
ఇప్పటికే ఎన్.టి.పి.సి లాంటి సంస్థలు వారికోసం రెస్ట్ హాల్స్ ను ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నారు.
అలాగే సింగరేణిలో కూడా
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని నామమత్రపు రుసుముతో ఒకవంద రూపాయల బుకింగ్ తో వారికి సౌఖర్యం కల్పించాలని ఆయన. డిమాండ్ చేశారు.
కంపనీలో చాలా క్వార్టర్స్ కాళీగా ఉన్నాయని. ఎందరో సింగరేణి కార్మికులు కానివారికి , రాజకీయ ఓత్తిల్లతో పనికిరాని వాల్లకు ఇచ్చేబదులు
అవే క్వార్టర్లను ఒక ఐదారు క్వార్టర్లను ఒక్కో క్వార్టర్ లో నలుగురైదుగురు ఉండేలా నిర్మించి వారు వచ్చినప్పుడు ఉండేవిధంగా ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఏరియా నాయకులు ఎర్ర శ్రీనివాసరెడ్డి, చొప్పరి రామస్వామి, బి.అశోక్ కుమార్, వంగల మహేష్ లు పాల్గొన్నారు.