-జాయింట్ కలెక్టర్ మోతీలాల్ కు వినతి
-చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 17:
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లులు గత ప్రభుత్వం ఇచ్చిన సి.ఎం.ఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించి గత 10 ఏళ్లలో సుమారు 63 కోట్లు రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ నాయక్ వినతిపత్రం అందజేసినట్టు బి ఎస్ పి చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కళ్ల రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్ల నుండి సీ.ఎం.ఆర్ బియ్యాన్ని రికవరీ చేస్తూ రైస్ మిల్లులను సీజ్ చెయ్యాలని బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకొని యెడల బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మొదలుపెడుతుందని హెచ్చరించారు.