ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 6 :
మందమర్రి పట్టణంలోని మొదటి జోన్ కు చెందిన సింగరేణి మాజీ కార్మికుడు కలవల లచ్చన్న ఇటీవల అనారోగ్యానికి గురై రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మందమర్రి ఏరియా రిటైర్డ్ కార్మిక సంఘం అధ్యక్షుడు వాసాల శంకర్ సారధ్యంలో సోమవారం నాయకులు ఏరియా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈసందర్భంగా లచ్చన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందిచాలని వైద్యులను కోరారు. వీరి వెంట సంఘం నాయకులు పోల్ సంపత్, జక్కం రాజన్న, ఆసం కొమురయ్య లు ఉన్నారు.