ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగష్టు 17 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ లో గత 33 ఏండ్లుగా కోర్ట్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన గుర్రాల శంకర్ రెడ్డి దంపతులను గురువారం ఎస్సై ఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా పదవి విరమణ సన్మానం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన చేసిన సేవలను కొనియాడారు.అంతే కాకుండా ఆయన సుదీర్ఘ ఉద్యోగం జీవితంలో నిత్యం వచ్చి పోయిన ప్రతి అధికారికి అందుబాటులో ఉంటూ చెప్పిన పనిని తూచ తప్పకుండా సమయానుకూలంగా విధులు నిర్వహించిన ఆయన గొప్పతనాన్ని ప్రతీ ఒక్కరూ అభినందించారు. అనంతరం శంకర్ రెడ్డి దంపతులను పూల మాలలు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఆర్ కృష్ట,ఎస్సై లక్ష్మన్, ఆఫీస్ సిబ్బంది,శంకర్ రెడ్డి తో పనిచేసిన కోర్టు కానిస్టేబుల్స్, సర్కిల్ హోంగార్డులు పాల్గొన్నారు.