జగిత్యాల, ఆగస్టు 17: ఓ మాదిగ బిడ్డ కష్ట పడ్డ సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఎందుకు ఇంత కక్ష సాధిపు అని ఎంఎస్పీ జగిత్యాల జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం పేర్కొన్నారు. గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో గంగారాం ఒక ప్రకటన విడుదల చేశారు. గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన తడగొండ విజయ్ మాదిగ రాయికల్ పట్టణ కేంద్రంలోని సర్వే నెంబర్ 52/ఆ లో పదిన్నర గుంటల భూమి కొనుగోలు చేశారని గంగారాం పేర్కొన్నారు. విజయ్ భూమి కొనుగోలు సమయంలో పూర్తి వివరాలను తెలుసుకొని భూమిని కొనుగోలు చేశారన్నారు. కొన్ననాటి నుంచి రాని ఇబ్బంది ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో ఎదురావుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలో 2014 లో ఎం ఎల్ ఏ గా పనిచేసిన సమయంలో జీవన్ రెడ్డి ఈ భూమిపై మాట్లాడిన సందర్భాలు లేవన్నారు. ఇటీవలి కాలంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాదిగ బిడ్డ కొన్న భూమిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని గంగారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాదిగ బిడ్డ ఇంత విలువైన భూమి కొనుగోలు చేశాడన్న ఈర్ష్య భావంతో వేధింపులకు గురిచేస్తున్నడని ఆరోపించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అనేక అక్రమాలకు పాల్పడినా వారికి వత్తాసు పలుకుతాడని అన్నివిధాలుగా న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన మాదిగ బిడ్డ విజయ్ పై కక్ష సాధింపు చర్యలను ఎంఎస్పీ, ఎమ్మారెస్పీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇదే పద్దతిలో మాధిగలను వేధిస్తే మాదిగ బిడ్డలందరం ఏకమై మీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని గంగారాం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితుడు తడగొండ విజయ్, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీనివాస్, జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి బొనాగిరి కిషన్, కో ఇంఛార్జి మీసాల సాయిలు, డివిజన్ ఇంఛార్జి నక్క సతీష్ బోల్లే, జిల్లా నాయకులు అనిల్ తదితరులు ఉన్నారు.