ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 31 అభివృద్ధి పథకాలను అర్హత కలిగిన ప్రతి లభించరునికి అందించడంతో పాటు అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి,ప్రజలతో మమేకమై సేవలు అందించే ప్రతి ప్రభుత్వం ఉద్యోగి జీవితం లో పదవీ విరమణ తప్పనిసని అని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిగా పనిచేసిన కౌశిక్ వెంకటరమణ పదవి విరమణ పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరైన శాలవుతో సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవి విరమణ తప్పనిసరి అని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి,అర్షత గల వారికి అందించడంలో అహర్నిశలు శ్రమిస్తారని అన్నారు.1987లో ఉద్యోగం లో చేరిన కౌశిక్ వెంకటరమణ 37 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి జిల్లా ఉపాధి హామీ కల్పన శాఖ అధికారిగా పదవీ విరమణ పొందారని, అనంతరం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారని అక్షాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.