ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 31 : రానున్న వర్షాకాలంలో జిల్లాలోని ప్రజా రక్షణ దిశగా ముందస్తుగా అప్రమత్తత చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లోగల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఆవరణలో నస్పూర్ మండల తాహశిల్దార్ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు, రానున్న వర్షాకాలం దృష్ట్యా జూన్ 01 తేదీ నుండి వర్ష మాపకము నిరంతరాయంగా పని చెయకటకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వర్షాభావ లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన ముందస్తు చర్యలు చెపట్టెందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.