పొరపాట్లు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

 

 

లెక్కింపుకు 22 రౌండ్స్ , 22 టేబుల్స్ ఏర్పాటు.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 31: జూన్ 4వ తేదీన మహబూబాబాద్ లో జరగనున్న పార్లమెంటు ఓట్ల లెక్కింపు లో ఎలాంటి పొరపాట్లు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారిని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు రిటర్నింగ్ అధికారి ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా తో కలిసి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరగనున్న పార్లమెంటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, తొందరపడి పొరపాట్లు చేయరాదని సూచించారు. విధులు కేటాయించిన సిబ్బంది 4వ తేదీన సమయ పాలన పాటిస్తూ కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని , సిబ్బందికి సంబంధించిన సిట్టింగ్ అరెజ్మెంట్స్ కూడా పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. రిజర్వ్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, సిలింగ్ సిబ్బంది ప్రత్యేకంగా ఉండాలని అన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో సిబ్బందికి అదనపు రిటర్నింగ్ అధికారి ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌, కంట్రోల్‌ యూనిట్లలోని ఓట్ల కౌంటింగ్‌, వివిపాట్‌ స్లిప్పులు కౌంటింగ్‌ విధి విధానాలను వివరించి కౌంటింగ్‌ సిబ్బంది నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని తెలియజేస్తూ పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఖచ్చితంగా అనుసరించాల్సిన నిబంధనలు గురించి కూలంకషంగా వివరించి సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ , అదనపు కలెక్టర్ సి హెచ్ మహేందర్ జి, ములుగు తహసిల్దార్లు విజయభాస్కర్, రవీందర్, ఎలెక్షన్ సెల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking