మణికొండలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ దండగ అని రైతాంగాన్ని అవమాన పరిచిన పిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీ ఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ పిలిపు మేరకు రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్ ఆదేశాలతో బుధ వారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షులు బుద్దొళ్లు శ్రీరాములు ఆధ్వర్యంలో మణికొండ మున్సిపాలిటీ పరిధి లోని నేక్నంపుర్ 7 వ వార్డ్ ఆల్కాపూర్ చింతచెట్టు సర్కిల్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటును ఈ దేశంలో ఇస్తున్నటు వంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ యని, యాసంగి, ఖరీఫ్ పంటలకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ యని, గుంట భూమి ఉన్న రైతన్నకు కూడా రైతు బంధు, రైతు బీమా అందిస్తున్న రైతు బాంధవుడు కేసీఆర్ అని, ఇప్పటివరకు రైతుల ఖాతాలో 73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు పథకం ద్వారా అందించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం యని, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులను పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు రైతుల పక్షపాతం చూపుతూన్నారు, మరో సారి కెసిఆర్ ప్రభుత్వం రావడం కాయం అని ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపాలిటీ పార్టీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking