మానుకొండ శ్రీధర్ కుటుంబానికి పొంగులేటి పరామర్శ

ఖమ్మం ప్రతినిధి జూలై 12 (ప్రజాబలం) ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ఖమ్మం మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మానుకొండ రాధాకిశోర్ చిన్నకుమారుడు మానుకొండ శ్రీధర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందగా వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం పరామర్శించారు మృతుని ఫొటోకు పూలు వేసి నివాళ్లర్పించారు చిన్న వయస్సులోనే గుండెపోటు రావడం బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు అదేవిధంగా పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, కార్పొరేటర్లు దొడ్డా నగేష్ మలీదు జగన్ మిక్కిలినేని నరేంద్ర తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking