సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
హైదరాబాద్ జూలై 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న క్రీడా అకాడమీలు స్పోర్ట్స్ స్కూళ్ల పని తీరు మెరుగుపడటానికి నిరంతర పర్యవేక్షణ అవసరం ఉందని పతకాలు సాధించే ప్రాంగణాలుగా అకాడమీలను తీర్చిదిద్దబడాలని స్పోర్ట్స్ అథారిటి ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు.ఈరోజు ఎల్‌బి స్టేడియంలో తన కార్యాలయంలో వరుసగా రెండో రోజు జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్లు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి, క్రీడల్లో కాకుండా విద్యాపరంగా కూడా మంచి ఫలితాలు సాధించే సంస్థలుగా తీర్చి దిద్దబడాలని ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనం, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సూచనలను అనుసరిస్తూ అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్ల పనితీరు, మెరుగుదలకు నిరంతర పర్యవేక్షణ, పారదర్శక విధానాలతో ముందుకు వెళ్లాలని ఛైర్మన్ అధికారులను కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగ మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలని ఛైర్మన్ సూచించారు.సీఎం కేసీఆర్ స్ఫూర్తితో మూసధోరణి వీడి, నూతన దృక్పదాన్ని అవరుచుకుంటూ, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా నూతన బోధన శిక్షణ విధానాలను అలవర్చుకోవాలని ఛైర్మన్ అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్ల అధికారాలకు ఆదేశించారు.అకాడమీల స్పోర్ట్స్ స్కూళ్లలో క్రీడాకారులు ఎంపికకు వివిధ రంగ నిష్ణాతులు, అనుభవజ్ఞులచే ‘సెలక్షన్ కమిటి’ ఉండాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అకాడమీలు స్పోర్ట్స్ స్కూళ్ల విద్యార్ధిని విద్యార్ధులకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని ప్రతి విద్యార్ధి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని, డైట్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఛైర్మన్ ఆదేశించారు.అకాడమీలలో అవసరమైన క్రీడా సామాగ్రి అందుబాటులో ఉండాలని, శిక్షణ విషయంలో ఎటువంటి అలసత్వం ఉండరాదని, ఎక్కడైనా కోచ్‌ల కొరత, సామాగ్రి కొరత ఉంటే వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ప్రతి అకాడమి స్పోర్ట్స్ స్కూల్‌లో దీర్ఘకాలిక ` స్వల్పకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకొని నిరంతరంగా సమీక్షించుకోవాలని, ఆయా అకాడమిల్లో క్రీడాకారుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని ఛైర్మన్ సూచించారు. రెండురోజుల సమావేశంలో వ్యక్తమైన వివిధ అభిప్రాయాలు చర్చకు వచ్చిన అంశాలన్ని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు చేపడతామని ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ తెలిపారు.ఈ సమావేశంలో స్పోర్ట్స్ అథారిటి ఓఎస్‌డి, ఐఏఎస్ డా॥ కె. లక్ష్మీ, డిప్యూటి డైరెక్టర్ చంద్రారెడ్డి, స్పోర్ట్స్ స్కూలు ప్రత్యేకాధికారి డా॥ హరికృష్ణ, ఛైర్మన్ ఓఎస్‌డి కె. నర్సయ్య, స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్.కె. బోస్, అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్, వనపర్తి డివైఎస్‌ఓ టి. సుధీర్‌కుమార్ రెడ్డి, కరీంనగర్ డివైఎస్‌ఓ రాజవీరు, ఆదిలాబాద్ డివైఎస్‌ఓ వేంకటేశ్వర్‌రావు, వివిధ అకాడమీల స్పోర్ట్స్ స్కూళ్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Post