తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్‌ రెడ్డి

 

అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్‌ ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌
..
గురువారం ప్రమాణ స్వీకారం
..
7వ తేదీన ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్‌ రెడ్డి
..
రేవంత్‌ రెడ్డిగారి ప్రొఫైల్‌

1969 నవంబరు 8న పుట్టిన రేవంత్‌ రెడ్డి

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్‌

2006లో మిడ్జిల్‌ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వాతంత్య్రంగా ఎన్నిక

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలుపు

2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌

2014%–%17 మధ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా

2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుండి పోటీ చేసి ఓటమి

2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం

2021లో జూన్‌ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్‌

2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం

ఢీల్లీ బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
నూతన సీఎల్పీ నాయకుడుగా తనను ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున
ఖర్గే గారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు
మద్ధతుగా నిలిచిన శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, శ్రీమతి ప్రియాంక
గాంధీ, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌
మాణిక్‌ రావు ఠాక్రే, కర్ణాటక డీప్యూటీ సీఎం డికేశివకూమార్‌, ఇతర ఏఐసీసీ
పరిశీలకులకు ధన్యవాదాలు తెలిపారు.అదే విధంగా పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య
నాయకులకు రేవంత్‌ ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెల 7న జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మల్లికార్జున ఖర్గే,
శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ, కేసీ
వేణుగోపాల్‌, మాణిక్‌ రావు ఠాక్రే, డీకే శివ కుమార్‌ లను వ్యక్తిగతంగా
ఆహ్వానించేందుకు రేవంత్‌ రెడ్డిఈ మంగళవారం సాయంత్రం ఢీల్లీ బయలుదేరి వెళ్ళారు.

 

తుపాను ఎఫెక్ట్.. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి: రేవంత్ రెడ్డి

• తెలంగాణలోని పలు జిల్లాల్లో తుపాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి ట్వీట్

• వరి ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

• ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలి

• అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking