హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర సీఎల్‌పీ నేతగా ఎన్నికైనా రెవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్‌జేడీ రాష్ట్రీయ జనతాదళ్ నాయకురాలు శోభాయదవ్ ఈసందర్భంగా శోభాయాదవ్ మాట్లాడుతూ ఇండియా కూటమీలో భాగస్వాములమయిన ఆర్‌జేడీ పార్టీ తరుపున తెలంగాణా రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆర్‌సేడీ పార్టీ తీర్మానించింది.ఇండియాకూటమిలోని కాంగ్రెస్‌పార్టీ తెలంగాణా రాష్ట్రంలో విజయం సాధించడం సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ విజయానికి కారకులైన ఎఐసీసీ నాయకులకు తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 సీట్లు గెలిచి ఇండియా కూటమి ప్రాధన అభ్యర్థిగా నిలవాలని కోరుకుంటున్నా అని అన్నారు.