మెదక్ ప్రజా బలం న్యూస్ :-
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మెదక్ జిల్లా ఎంపీపీలపొరం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఏర్పాటుచేసిన సమావేశంలో రేవంత్ రెడ్డిని దుయ్యబట్టారు.
వారు మాట్లాడుతూ తెలంగాణ రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు ఇస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి రైతులపై.. ప్రభుత్వం ఇస్తున్న కరెంటుపై.. అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని రైతుల కష్టాలు బాధలు తెలిసిన వాడైతే విధంగా మాట్లాడేవాడు కాదని ఎండుగట్టారు. రైతు కుటుంబంలో పుట్టి, రైతు బాధను ఎరిగిన ముఖ్యమంత్రి రైతులను రాజును చేసిన తీరును ఓర్చుకోలేక రైతుల పట్ల చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేక ఉచిత కరెంటు పై, రైతులపై, అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని చేసిన వాక్యాలను వెంటనే వెనకకు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎంపీపీలపోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.