మెదక్ జూలై 11ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలం కుచారం జైత్రం తాండ కి చెందిన వివిధ పార్టీలకు చెందిన 30 మంది కార్యకర్తలు బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి లో చేరారు .
ఈ సందర్భంగా గిరిజన యువకులు మాట్లాడుతూ కూచరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న తమ గిరిజన తండాను అభివృద్ధి చేయడంలో మండల బిఆర్ఎస్ నాయకులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని గిరిజన యువకులు వాపోతున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ , నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్,బీజేవైఎం మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ యాదవ్ , శ్రీనివాస్ , మెదక్ జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు రాజు నాయక్, నాయకులు కిషన్ నాయక్, నన్ను నాయక్, నరేందర్ నాయక్, మోహన్ నాయక్, జగన్ నాయక్, సుధాకర్ నాయక్, హిరలాల్ నాయక్ , విజయ్ నాయక్, శేఖర్ నాయక్ ప్రజా ప్రతినిధులు బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.