మండల ఎంఈఓ ఆఫీస్ ముందు 2 రోజు కొనసాగిన టోకెన్ సమ్మే

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, కనీస వేతన అమలు చేయాలని 2వ రోజు టోకెన్ సమ్మె ను స్థానిక ఎంఈఓ ఆఫీస్ ముందు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా కాంతమ్మ, రబియా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సిఐటియు)అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ…మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 2022 మార్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో కార్మికులకు 2000 రూపాయలు పెంచుతున్నట్లుగా ప్రకటించారు కానీ నేటి వరకు పెంచిన వేతనాలు ఇవ్వడం లేదు.ఏరియాతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం 1000 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు.కోడి గుడ్డుకు అదనంగా రూపాయి నర చేతుల నుండి పెట్టుకున్న అట్టి డబ్బులు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి ఉంది అన్నారు.కార్మికుల పట్ల రాజకీయ ఒత్తిళ్లు మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకు తక్షణమే బడ్జెట్ కేటాయించి పెండింగ్ ఉన్న బిల్లులను తక్షణ ఇవ్వాలని గుడ్ల కు అదనంగా బడ్జెట్ ని కేటాయించాలని ప్రభుత్వం కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే కొత్తగా మెనూకి అదనంగా బడ్జెట్ ను కేటాయించాలని మూడు రోజుల టోకేనన్ సమ్మెను నిర్వహిస్తున్నాం.ఈ సమ్మె సందర్భంగా నైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే రావాల్సిన బకాయిలను బిల్లులను మంజూరు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామన్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మధు, లక్ష్మి,మల్లవ్వ, ఎల్లవ్వ, లచ్చవ్వ, సత్తక్క, సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking