బేగంపేట విమానాశ్రయంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ కు స్వాగతం పలికిన రేవంత్‌ రెడ్డి

సనత్‌ నగర్‌ ప్రజాబలం ప్రతినిధి:వికారాబాద్‌ జిల్లా పూడురు మండలంలో ఇండియన్‌ నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్‌ స్టేషన్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంలో సీఎం తోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి , బండి సంజయ్‌ , రాష్ట్ర మంత్రి కొండా సురేఖ , ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ఉన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో పూడురు మండలంలోని కార్యక్రమ స్థలికి బయలుదేరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking