రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 అక్టోబరు 2024:
ది సిటిజన్స్ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకొన్న నిర్ణయం మేరకు మణికొండ స్పెక్ట్రమ్ విల్లాస్ వద్ద వంతెన నిర్మాణం దాని ప్రాముఖ్యతను గురించి మాట్లాడడానికి సోమవారం రోజున మున్సిపల్ కమిషనర్ ను కలసి ఇట్టి వంతెన అవసరం గురించి వివరించడం జరిగిందని, ప్రతి వర్షాకాలంలో వంతెన లేనందు వలన నీటి ప్రవాహం నివాస గృహాల లోనికి విచ్చేసి ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారిందని, ముఖ్యంగా మణికొండ లోని వెంకటేశ్వర కాలనీ, స్పెక్ట్రమ్ విల్లాస్ కాలనీ వాసులు గత అనుభవాలను నెమరు వేసుకొని తీవ్ర ఆందోళన వ్యక్త పరచినారు, చర్చల్లో భాగంగా ఇట్టి వంతెన నిర్మాణం మున్సిపల్ కౌన్సిల్ లో ఆమోదించిన అనంతరం కూడా పనులు సాగడం లేదనీ సదరు కమిషనర్ కు తెలియపరుస్తూ స్పెక్ట్రమ్ విల్లాస్ వద్ద వంతెన కట్టే పనిని వేగవంతం చేయాలని అభ్యర్థిస్తూ మెమొరాండం సమర్పించడం జరిగినది, ఈ సమయంలో సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి శైక్ ఆరిఫ్ మోహమ్మద్, జాయింట్ కార్యదర్శి బొమ్ము ఉపేంద్రనాధ్ రెడ్డి, స్థానిక నాయకులు నరసింహులు, సందీప్ చావ్వ, తెల్ల జస్వంత్ మరియు రాజాలు పాల్గొని ఇట్టి నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మరియు నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి అధికారులతో ఎల్లవేళలా సమన్వయం కొనసాగిస్తామని ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు స్థానిక నాయకులు తెలియ పరచారు.