ప్రజాబలం శేర్లింగంపల్లి ప్రతినిధి శనివారం రోజున ఉదయం 11.00 గంటలకు గోపన్ పల్లి తండా ఫ్లై ఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
గచ్చిబౌలి డివిజన్ పరిదిలోని గోపన్ పల్లి తండా చౌరస్తా వద్ద రూ. 28 కోట్ల 50 లక్షల రూపాయల అంచనావ్యయం తో నిర్మించిన ఫ్లై ఓవర్ ను రేపు అనగా శనివారం 20.07.2024 ఉదయం 11.00 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగును.
కావున కార్పొరేటర్లు ,ప్రజాప్రతినిధులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేయభిలాషులు,పాత్రికేయ మిత్రులు, అభిమానులు ప్రతి ఒక్కరు తప్పకుండా హాజరై ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి చేశారు.