రైతు రుణం’’ తీర్చుకున్న రేవంత్‌ సర్కార్‌ – టేస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌ రావు

‘‘హనుమకొండ వరంగల్‌ ప్రజాబలం ప్రతినిధి:దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రైతాంగానికి రుణమాఫి చేసి రైతు రుణం తీర్చుకున్న ఏకైక ప్రభుత్వం రేవంత్‌ రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ చైర్మన్‌ మార్నెనీ రవీందర్‌ రావు .
వరంగల్‌ కలెక్టర్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణ మాఫీ 2024 రెండవ విడత (లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయల నిధుల విడుదల కార్యక్రమంలో వరంగల్‌ కలెక్టర్‌ సత్య శారద తో కలిసి పాల్గొన్న మార్నెని రవీందర్‌ రావు గారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీకి ర్కెతులు ఎంతో ఆతృతం గా ఎదురు చూస్తున్న తరుణంలో రెండో విడత రుణమాఫీ నిధులను ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన శుభసందర్భంగా మా ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతాంగం తరుపున ప్రభుత్వానికి ప్రత్యెక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం..
ఇప్పటికే సహకార బ్యాంకుల ద్వారా మొదటి విడతలో వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 8151 రైతులకు 35 కోట్ల 89 లక్షల మరియు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 23841 మంది రైతులకు 106 కోట్ల 71 లక్ష రూపాయల రుణ మాఫీ చేసామని అన్నారు..


రెండవ విడతలో భాగంగా వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 142 కోట్ల 58 లక్షల రూపాయల రుణమాఫి చేస్తున్నామని అన్నారు..
సహకార సంఘాల ద్వారా రెండవ విడతలో భాగంగా దాదాపు 76 కోట్ల 52 లక్షల రూపాయలు రుణమాఫి చేస్తున్నామని అన్నారు..
ఆధార్‌ నెంబర్‌, ఇతర వివరాలు సరిగా లేకపోవ డం వంటి కారణాలతో కొంతమంది రైతులకు డబ్బులు జమ కాలేదని ఎలాంటి అపోహలు అవసరం లేదని తప్పకుండా వాటిని పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ అధికారులతో సమీక్ష జరిపి అర్హులైన ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తాం..
అనంతరం కలెక్టర్‌ ఆవరణలో రుణ మాఫీ చేసిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి రవీందర్‌ రావు రైతులతొ కలిసి పాలభిషేకం చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు…
ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సంధ్య రాణి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారీ ఉషా దయాళ్‌,డిసిఓ సంజీవ రెడ్డి, డిసిసిబి సెంట్రల్‌ బ్యాంక్‌ సీఈఓ వజీర్‌ సుల్తాన్‌,వ్యవసాయ అధికారులు,రైతులు పాల్గొన్నారు….

 

Leave A Reply

Your email address will not be published.

Breaking