మణికొండ మునిసిపల్ కమిషనర్తో ది సిటిజన్స్ కౌన్సిల్ చర్చలు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 30 జులై 2024:
మణికొండలో వీధి కుక్కల బారిన పడకుండా రోజు వారి కార్యక్రమాలను నిర్వహించడానికి పురజన మహిళలు, పిల్లలు వెనకంజ వేస్తున్నారని అట్టి బెడదకు నివారణగా ది సిటిజన్స్ కౌన్సిల్ నేపథ్యంలో ఈ రోజు మణికొండ మునిసిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ను సంగ సభ్యులందరూ కలవడం జరిగినదని, హై కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం కుక్కలకు శెల్టర్ హోమ్ ఏర్పాటు చేయాలని ఈ విషయమై కలెక్టర్ మరియు సీ.డీ.ఎం.ఏ అధికారులను కూడా కలవడం జరిగిందని తెలుపుతూ, అందుకు స్పందించిన కమిషనర్ తాను పై అధికారులకు సమాచారం అందిస్తానని, ప్రస్తుతం బ్లూ క్రాస్ సొసైటీ వారు వ్యాక్సిన్ ఇస్తున్నందుకు ఒక కుక్కకు 1650/- ముల్యాన్ని వారికి చెల్లిస్తున్నామని కావున వారిని మరియు కుక్కలను పోషిస్తున్న యాజమాన్యాన్ని ప్రజా ప్రతినిధులతో పాటు స్థానిక ప్రజల సహకారంతో, కాలనీ సభ్యులందరితో కలసి నివారణ చర్యలు చేపడుతామని తెలియ జేసినారు, తదుపరి చర్చలలో భాగంగా రహదారి మరమ్మత్తులు, వీధి దీపాల కొరత ఎక్కువగా ఉందని పర్యవసానంగా బోనాల పండుగ సందర్భముగా భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురి ఐనారని కనుక రాబోయే వినాయక చవితి నవ రాత్రి ఉత్సవాల లోపు వాడ వాడలా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని ఇట్టి చర్చలలో వైజాగ్ మాజీ మున్సిపల్ కమిషనర్ రమేష్ తో పాటు మునిసిపల్ కౌన్సిలర్లు 2వ వార్డ్ వసంత్ రావు చౌహాన్, 7వ వార్డ్ బిట్ట్లు పద్మారావు, 8వ వార్డ్ ఆలస్యం నవీన్ కుమార్, 9వ వార్డ్ శ్రీకాంత్ స్వామి, ది సిటిజన్స్ కౌన్సిల్ కార్యదర్శి షేక్ ఆరిప్ మొహమ్మద్, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ఉప కార్యదర్శి ఉపెందర్నాథ్ రెడ్డి, కోశాధికారి దిలీప్ కక్కడ్, సభ్యులు శ్రీధర్ గుప్తా, డాక్టర్ జమ్మీర్, ఫైజల్, జియా, అఖిల్ మరియు వై.ఎస్.ఆర్ కాలనీ, పంచవటి కాలనీ వాసులు, బాపు హిల్స్ కాలనీ రాజూ తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking