రైతురుణ మాఫీ రెండవ విడత కార్యక్రమం

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 30:
రైతురుణ మాఫీ తో రైతుల ముఖాలలో ఆనందాన్ని నింపడమే కాకుండా, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని అధిక పంటలు పండించి రాష్ట్రాన్ని, రైతు కుటుంబాలను ఆర్థికంగా పటిష్టపరచడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతమ్ అన్నారు.
రైతురుణ మాఫీ రెండవ విడత లో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రైతురుణ మాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టరు రైతులకు చెక్కులు అందజేసారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరు పథకాలలో భాగమైన రైతు రుణ మాఫీ పథకంతో రైతుల ముఖాలలో ఆనందాన్ని నింపడమే కాకుండా, ఈ అవకాశాన్నిరైతులు సద్వినియోగం చేసుకొని రాబోయే రబీ, కరీప్ సీజన్లలలో అధిక పంటలు పండించి రాష్ట్రాన్ని, రైతు కుటుంబాలను ఆర్థికంగా పటిష్టపరచడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈరైతు రుణ మాఫీ కార్యక్రమం పండుగ వాతావరణంగా ఉందని కలెక్టరు హర్షం వ్యక్తం చేసారు. మొదటి విడత రైతురుణ మాఫీ జూలై 18న జరిగిన కార్యక్రమంలో లక్షరూపాయల వరకు ఉన్నరుణాలకు గాను చెక్కులు రైతులకు అందజేయడం జరిగిందని కలెక్టరు తెలిపారు. ఇప్పుడు చేస్తున్నరైతురుణ మాఫీరెండవ విడత లో ఒక లక్ష నుండి లక్షయాభై వేల రూపాయల వరకు చెక్కులు అందజేయడం జరుగుతుందన్నారు. ఏదేని సాంకేతిక కారణాల వలన మీయొక్కరుణ మాఫీ జరగలేదంటే ఆందోళన చెందకుండా గ్రామ, మండల, జిల్లా స్థాయి లలో ఏర్పాటు చేసిన గ్రివెన్స్ సెల్ లో మీరు మీ వివరాలు తెలుసుకొని రుణ మాఫీ కానియెడల మరల దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. రైతుల రుణం వేర్వెరు ప్రాంతాలలో వివిధ బ్యాంకులలో ఉన్నా సరే రుణాలు మాఫీ అవ్వడం జరుతుందని కలెక్టరు తెలిపారు. ఏలాంటిగ వదంతులు నమ్మకుండా ప్రభుత్వం అందించేరుణ మాఫీ అర్హులైన రైతులందరికి అందుతుందనే నమ్మకంతోరైతులు ఉండాలన్నారు. రుణ మాఫీ జరిగినరైతులకు వెంటనే రాబోయే రబీ కరీఫ్ పంటలకు అవసరమైన రుణాలను రైతులకు అందించాలని లీడ్ బ్యాంక్ మేనేజరును, బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూఈ ప్రభుత్వం రైతులకు అందించే ఆర్థిక చేయుత ఏంతో ఉపయోగకరమని , రైతులు ఆందోళన చెందకుండా అర్హులైన అందరికిరుణ మాఫీ అందుతుందన్నారు. రుణమాఫీ మొత్తం లోన్ అకౌంట్లలో పడకపోతే కంగారుపడకుండా ఏర్పాటు చేసిన వ్యవసాయ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) రాధికా గుప్తా మాట్లాడుతూ రైతు రుణ మాఫీలో పథకంలో లబ్ది పొందిన వారందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, రాబోయే మూడవ విడుతలో కూడా మిగిలిన వారికిరుణ మాఫీ జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి రేఖా మేరి, మున్సిపల్ ఛైర్మన్లు, రైతు సంఘం నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking