మహిళ క్యాంటీన్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్ రాధిక గుప్తా

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 30:

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయబోయే మహిళ క్యాంటీన్ ను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) రాధిక గుప్తా మంగళవారం పరిశీలించారు. మహిళ స్వయం సహాయక బృందాలచే ఏర్పాటు చేయించే మహిళా క్యాంటీన్లలలో భాగంగా అదనపు కలెక్టర్ కలెక్టరేట్ లో కేటాయించిన క్యాంటీన్ ను పరిశీలించి కేటాయించిన మహిళా గ్రూప్ వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ లో ఎంత మంది వర్కర్లు, ఎక్కడెక్కడ ఏదేది పెట్టాలనే అంశాలను అడిగి తెలుసుకొని, అవసరమైన సూచనలు ఇచ్చారు . పరిశుభ్రతను పాటించాలని, రుచికరమైన ఆహారాన్ని అందించాలని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పిడి డిఆర్ డిఓ సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking