కళ్యాణ లక్ష్మి పేదింటి ప్రజలకు వరం

– హావేళిఘణాపూర్ మండలంలో 53 మంది లబ్దిదారులకు చెక్కుల అందజేత
– నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హావేళిఘణాపురం మండలంకు సంబంధించి 53 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని ఆయన అన్నారు. నియోజక వర్గంలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామినిచ్చారు.

ఈ కార్యక్రమంలో హావేళిఘణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కరు శ్రీనివాస్, శేరి మహేందర్ రెడ్డి, పరుశురాం గౌడ్, మొండి పద్మారావు, మహేందర్ రెడ్డి, మంజుల, ఆదిల్ పాషా, వెంకట్ రెడ్డి, భాస్కర్, సాయిబాబా, శ్రీకాంత్, మామిళ్ళ సాయిలు, నాగపురం అక్బర్, గాజిరెడ్డిపల్లి సాయిలు, సతీష్, చిన్న, సాప చిన్న సాయిలు, యాదవరెడ్డి, పట్నం శంకర్, బ్యాతోల్ నాగిరెడ్డి తో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడూరి ఆంజనేయులు, హపీజ్ మోల్సాబ్, చైర్మెన్ చంద్రపాల్, కౌన్సిలర్ దాయర లింగం, ఆవారి శేఖర్, పేరూర్ శంకర్, శ్రీనివాస్ చౌదరి, గూడూరి క్రిష్ణ, గూడూరి అరవింద్ లతో పాటు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking