గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 30 : హైదరాబాద్ గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల సిద్దేశ్వర్ అధ్యక్షతన జరిగిన రాష్ర్ట కార్యవర్గ సమావేశం కు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి హాజరై మాట్లాడారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల పెంపు పై మరియు స్థానిక సంస్థల బలోపేతంపై అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై వారు మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేషనల్ కోఆర్డినేటర్ కిరణ్ జీ మూగబాసవ తో పాటు వివిధ జిల్లా అధ్యక్షులు జోనల్ కొర్డినేటర్ లు వివిధ జిల్లాల అధ్యక్షుడులు తదితరులు పాల్గొన్నారు.