కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణ కు ఎన్ని నిధులు కేటాయించిందో

 

మంచిర్యాల జిల్లా బీజేపీ నేతలు ప్రజలకు బహిరంగ పర్చాలని కాంగ్రెస్ డిమాండ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 30 : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణ కు ఎన్ని నిధులు కేటాయించిందో మంచిర్యాల జిల్లా బీజేపీ నేతలు ప్రజలకు బహిరంగ పర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మంగళవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ…కేంద్రం నిధులు ఎన్ని ఇచ్చింది,కేంద్ర మంత్రులు ఎన్ని పథకాలు తీదుకువచ్చారో చెప్పాలని అన్నారు.మంచిర్యాల నియోజకవర్గ ముకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏమి చేయలేదని తప్పుడు విమర్శలు చేయడం బీజేపీ కి తగదని హితవుపలికారు.ప్రేమ్ సాగర్ రావు కరకట్టకు,ఎత్తిపోతల పథకం,మాతాశిశు ఆసుపత్రి నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణంకు అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు.గెలిచి ఎనిమిది నెలలు కాలేదు అప్పుడే తొందర పడితే ఎలా అని బీజేపీని ప్రశ్నించారు.ఇంకా సమయం ఉంది నియోజకవర్గ ము ఎంత అభివృద్ధి చెందుతుందో బీజేపీ నేతలు కళ్లారా చూసే రోజులు ముందున్నాయని అన్నారు.గత కేసీఆర్ ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లిందని రాష్ట్ర ఆర్ధిక స్థితి గాడిలో పెట్టడం ఎంతకష్టమో పాలకులకు తలపొటో మీకు తెలియదు అని విమర్శించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా తప్పు చేసిన వారిని ప్రేమ్ సాగర్ రావు క్షమించరని అందుకు అనేక ఉదంతాలు ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుమ్మల నరేష్ పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking