ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 30 : ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత రుణమాఫీ పథకంలో హరత గల ప్రతి రైతు లబ్ధి పొందేలా ప్రణాళిక బద్దకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ శాసనమండలి ప్రాంగణం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పర్సనల్ పద్ధతిన 2 వ విడత రైతు రుణ మాఫీ పథకం విధులను విడుదల చెయగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన,జిల్లా గ్రామీణ అభివృద్ధి కిషన్,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రైతు రుణ మాఫీ 2వ విడత 1 లక్ష రూపాయల నుంచి 1.50 లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చెందేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా లోని రైతు రుణ మాఫీ పథకం 14 వేల 104 మంది రైతులకు 138 కోట్ల 46 లక్షల 56 వేల 254 రూపాయలు అందించడం జరుగుతుందని, తెలిపారు. రుణ మాఫీ మొదటి విడతలో 28 వేల 727 మంది రైతులకు 151 కోట్ల 27 లక్షల19 వేల 35 రూపాయలు అందించడం జరుగుతుందని తెలుపారు.రుణ మాఫీ నగదు మొత్తాన్ని రైతుల ఖాతా లలో జమ చేయడం జరుగుతుందని,బ్యాంకు అధికారులు,వ్యవసాయ అధికారి సమస్యలతో వ్యవహారించి బ్యాంకు లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా నగదు మొత్తాన్ని రైతుల ఏమైనా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 0836-250501 ఏర్పాటు చేయడం జరిగిందని, మండల వ్యవసాయ అధికారి కార్యాలయం లో కూడా సంప్రదించవచ్చని, మండల వ్యవసాయ అధికారులు,వ్యవసాయ విస్తరణాధికారులు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటూ రైతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.రుణమాఫీ అమలు అయిన తరువాత సంబంధిత ఖాతా ద్వారా తిరిగి రుణం పొందవచ్చునని, రైతులు అవకాశాన్ని సద్వినియోగంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలుపారు.బ్యాంకు అధికారులు, సిబ్బంది రైతుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి, జవాబుదారీతనంతో వ్యవహరించాలని,2వ విడత రుణమాఫీ పథకాన్ని నిర్ణిత సమయంలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం ఇద్దరు రైతులకు రుణ మాఫీ చెక్కు లను అందజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు,రైతు సంఘాల నాయకులు,మండల వ్యవసాయ అధికారులు,వ్యవసాయ విస్తరణాధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.