ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 30 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో కు శ్రీ సత్య సాయి సేవా సమితి నుండి 50 కుర్చీలు పంపిణి చేయండం జరిగింది. మంగళవారం ఈ సందర్భంగా సత్య సేవ సమితి వారు మాట్లాడుతూ… సత్యసాయి సేవా సమితిలు’సేవ’అనే పదాన్ని గుర్తుంచుకోవాలి మరియు సేవా కార్యక్రమాలను ఉత్సాహంగా చేపట్టాలి.శారీరక బాధల తొలగింపు, మానసిక వేదనల ఉపశమనానికి మరియు ఆధ్యాత్మిక కోరికల నెరవేర్పుకు సేవ తప్పనిసరిగా ఉండాలి అని అన్నారు.ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షులు నల్మస్ కాంతయ్య, పాఠశాల కమిటీ కోశాధికారి కార్యదర్శులు చింత అశోక్ కుమార్,కొత్త వెంకటేశ్వర్లు,సత్య సాయి సేవా సమితి సభ్యులు వొజ్జల కృపాకర్,అన్నం శంకరయ్య,రసంగి మురళి,సత్తన్న, లింగమూర్తి,వివేకి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లావణ్య మాతాజీ పాల్గొన్నారు.