డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లచ్చిరెడ్డి ప్రతిపాదనలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సానుకూల స్పందన

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:డిప్యూటీ కలెక్టర్లు/స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల ముఖాముఖి సమావేశంలో అంశాల వారీగా పరిష్కారానికి చర్యలు. వేదికపైనే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ గారిని ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశంఏ
స్పషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల కేడర్‌ స్ట్రెంగ్త్‌ పెంపు.
సెలక్షన్‌ గ్రేడ్‌ గా నిర్దారించి (33)పోస్టులు అప్‌ గ్రేడ్‌.
(17) మంది సీనియర్‌ అదనపు కలెక్టర్‌ కేడర్‌ అధికారులకు %IAూ% పదోన్నతికి మార్గం సుగమం.
డిప్యూటీ కలెక్టర్‌ నుండి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గా( 50)మందికి పదోన్నతులు.
(33) జిల్లాలలో డీఆర్వో పోస్టులు భర్తీ చేసే అవకాశం.
పై నుండి పదోన్నతుల ఫైల్‌ కదిలితే మరో (80) మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ఛాన్స్‌!
రెవెన్యూ శాఖ ఉద్యోగులలో ఆత్మస్థైర్యం పెంచి కొత్త రెవెన్యూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే దిశగా రెవెన్యూ మంత్రి ఆలోచన!
తహసీల్దార్ల ఎన్నికల బదిలీలు దసరా కానుకగా పూర్తి చేయాలని ఆదేశం.
గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించుటకు ప్రభుత్వ నిర్ణయం.పూర్వ వీఆర్వోలు మరియు వీఆర్‌ఏల సేవలను వినియోగించుకోవాలనే ప్రతిపాదన.
రైతులకు,సామాన్య ప్రజలకు మెరుగైన భూ సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం.
రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచి జవాబుదారీ తనంతో కూడిన సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆలోచన.
ఈ కార్యక్రమంలో డీసిఏ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, నాయకులు బి.గీత, చంద్రారెడ్డి,మాధవి దేవి తదితరులు పాల్గొని వివిధ అంశాలపై సూచనలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking