దేవీ పుత్రుడు కాబోయే సీఎం ను దర్శించుకున్న మాజీ డీఎస్పీ ఆచార్య నళిని

 

ప్రజబలం :హైదరాబాద్ ప్రతినిధి.
ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కరీంనగర్ లోని ఆదిశక్తి ఆలయంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
.తన సర్వీస్ మేటర్స్ కు సంబంధించిన సస్పెన్షన్ లాంటి చిక్కుల్ని కూలంకషంగా పరిశీలించి, తన14 ఏండ్లుగా రావాల్సిన జీత భత్యాలను లెక్కించి, వడ్డీ తో సహా ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది.
వారి బ్యాచ్ వారందరూ ఇప్పటికే ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యారు.కాబట్టి తన ఉద్యోగానికి సంబంధించిన అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళతాయి.కనుక కేంద్ర హోం శాఖామాత్యులు మాత్రమే తనకు న్యాయం చేయగలరు.సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసు ను సహృదయం తో తోడ్పాటు చెయ్యడానికి ప్రయత్నము చేస్తున్నారని భావించి,న్యాయ పరిశీలన కు ఉపయోగపడుతుందని భావించి 16 పేజీల రహస్య నివేదిక ( బయానా)ను ఇచ్చి ఉంటిని.
అయినా ఏమీ తేల్చకుండానే వారు దాన్ని మధ్యలోనే వదిలేసినట్లు ఉన్నారు అని వాస్తవానికి తెలంగాణ తల్లి కోసం నేను చేసిన బలిదానాని కి నేను ఏ రోజు అవార్డులు,రివార్డులు ఆశించలేదు.ఇప్పుడు కూడా ఆశించడం లేదు. అందరిలా తను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటే అయిపోయేది కదా ఈ అవమానాలు కష్టాలు ఉండక పోయి ఉండేవి అని ఈ పుష్కర కాలంలో కొన్ని వేల సార్లు బాధపడ్డా .అస్తిత్వాన్ని కోల్పోయి అనామకురాలి గా ( నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లా) బతికాను.ఇన్ని కష్టాల్లో కూడా ఏనాడూ దేవుణ్ణి ఉపాసించడం ఆపలేదు.
అందుకేనేమో దేవుడు తన భక్తులకు కఠోర పరీక్షల అనంతరం వారికి ఏది కావాలో దాన్ని తప్పక ఇస్తాడు.వేద మాత కరుణా కటాక్షాలతో ప్రస్తుతం నాకు యజ్ఞ యాగాదులు నిర్వహించే బ్రహ్మ గా ధార్మిక లోకంలో అత్యంత గౌరవ మర్యాదలు,కీర్తి మరియు పుణ్యం వంటివి లభించాయి అని
కేంద్ర మంత్రి బండి సంజయ్ గొప్ప ఉద్యమకారులు మరియు మంచి భవానీ భక్తులు.వారు ఎంపతి తో మనోవ్యధను అర్థం చేసుకొని 14 ఏండ్ల నుండి మోస్తున్న అవమాన భారాన్ని తీర్చగలరని ఆశిస్తున్నాను. వారు చాలా సానుకూలంగా స్పందించారు.ఇక ఈ అంశం గురించి నిశ్చింతగా ఉండొచ్చు అని భావిస్తున్నాను అని అన్నారు.
మాకు వచ్చే డబ్బుతో మా గురుకుల పరిధిలో మా గోశాల పక్కనే ఒక వానప్రస్థ ఆశ్రమం నిర్మించి,అందులో వేద పఠన పాఠనాలను కొనసాగిస్తూ ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.మాజీ డి ఎస్పీ నళిని ఆవేదన.

Leave A Reply

Your email address will not be published.

Breaking