బీసీ ‘కులగణ”కు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందే..

 

విస్మరిస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయం! – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో ఉద్యమ పోరాటం చేస్తాం..

– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవి కృష్ణ గౌడ్
ప్రజాబలం :హైదరాబాద్,. ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేముందు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ సమక్షంలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కుల గణన చేసి, బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ ఒక ప్రకటన లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో బీసీలకు మొండి చేయి చూపించినట్లుగానే ఇటీవల కేంద్ర బడ్జెట్ లో కూడా మళ్లీ అదే పద్దతిని అవలంబించారని, 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.3000 కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మరోసారి దగా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్లో కూడా బీసీలకు సంక్షేమానికి గతం కంటే రూ.3000 కోట్లు నిధులు పెంచిన ఇవి ఏమాత్రం సరిపోవని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 60% ఉన్న బీసీలకు మూడు శాతం నిధులు కేటాయించడం శోచనీయమన్నారు. రాహుల్ గాంధీ మాటకు విలువ ఇచ్చైనా కుల గణన నిర్వహించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహి ంచాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు రాహుల్, సోనియా గాంధీ ల మాటలే తమ ప్రభుత్వానికి శిలాశాసనం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన ప్రతిసారి సమగ్ర కుల ఘరానా చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం గుర్తు లేదా..? అని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాహూల్ గాంధీ చెప్పింది.. శిలాశాసనం అయినప్పుడు సమగ్ర కుల గణన విషయంలో కూడా రాహుల్ గాంధీ మాట శిలాశాసనం కాదా..? అని బైరి రవికృష్ణ గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ మాటకు విలువ ఇవ్వద అంటూ ఆయన ప్రశ్నించారు. బీసీలకు రాజకీయంగా నష్టం జరగకుండా చేసి బీసీ రిజర్వేషన్లు

42% పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని, గత బిఆర్ఎస్ చేసిన తప్పిదమే

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ రాజకీ యంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రవి కృష్ణ గౌడ్ మరోమారు హెచ్చరించారు. బీసీ కుల గణన చేయకుండా ఎన్నికలకు వెళ్ళొద్దని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నామని, దీనిపై పునరాలోచన చేసి, 2014లో సమగ్ర కుల గణన చేపట్టిన విధంగా నైన, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి, ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ పేర్కొన్నారు.

రిజర్వేషన్లతోనే బీసీలకు ఫలాలు దక్కుతాయి

ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఉండడం వల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థానంలో రాణించ గలుగుతున్నారని, దేశ జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీ జాతులకు అసెంబ్లీ పార్లమెంటు లాంటి చట్టసభలకు రాజ్యాంగవర రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్లే బీసీ సమాజం వెనుకబాటుకు కారణం అయిందని, రాజ్యాంగవరంగా వచ్చే హక్కునే కోరుతున్నామని, బీసీలకు సమన్యాయం జరిగినప్పుడే బీసీలకు న్యాయం జరిగినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వే షన్లను 42 శాతానికి పెంచుతూ వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికల జరిపితే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. గతంలో 1976లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండల కమిషన్ వేసి వివిధ రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల విద్యా ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిశీలించి దేశవ్యాప్తంగా బీసీ కులాలను గుర్తించడం జరిగింది అయితే అంతకుముందే జనవరి 29 1953లో ‘శ్రీ కాక కాలేకర్ కమిషన్ ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం నెహ్రూ ప్రభుత్వం వేసింది. ఈ కమిషన్ ను 30 మార్చి 1955లో తన నివేదికను సమర్పించింది. ఇందులో దేశంలోని 837 అత్యంత వెనుకబడిన కులాలుగా, 2,399 వెనుకబడిన కులాలుగా పేర్కొన్నది. వీరికి 70% రిజర్వేషన్ కూడా కల్పించాలన్నది ఒక ముఖ్యమైన సూచన చేసింది. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. 1976 లో వచ్చిన జనతా ప్రభుత్వం కమిషన్ వేసింది గాని, ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయింది. తర్వాత వచ్చిన ఇంద్ర గాంధీ ప్రభుత్వం ఆ నివేదికను తుంగలో తొక్కింది. స్వాతంత్రం వచ్చిన అనంతరం అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా అగ్రకుల నాయకత్వం తోనే ఉన్నది కాబట్టి కింది కులాల వాళ్లను అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓటు బ్యాంకుగా చూసాయే తప్ప, మరొకటి కాదన్నారు. ఇప్పటికైనా బీసీలు హక్కును గుర్తించి, 42% రిజర్వేషన్ కు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మరో మారు ప్రభుత్వాన్ని బైరి రామకృష్ణ గౌడ్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking