రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 06 అక్టోబరు 2024.
మణికొండ పైప్ లైన్ సుందర గార్డెన్స్ గేటు ప్రక్కన ఉన్న వీధిలో రోడ్డుపై విపరీతమైన గుంతలు ఏర్పడడంతో రహదారి బాటసారులకు, ద్విచక్ర మరియు కార్ల వాహన చోదకులకు, రహదారి మీద ప్రయాణం చేసే వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని స్థానిక ప్రజలు భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుల దృష్టికి తేవడం సంగం శ్రీకాంత్ ఆధ్యర్యంలో ముతంగి లక్ష్మయ్య, యాళాల కిరణ్, జైరాం, ఈదులకంటీ మహేష్, ఎళ్ళస్వామి తది తరులు మున్సిపాలిటీ అధికారులను పలు మార్లు కలసి విషయాన్ని వారి దృష్టికి తేవడం జరిగినను, మునిసిపాలిటీ అధికారులకు ప్రజలు పడుతున్న ఇబ్బంది గురించి పదేపదే చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వారు ఏ రకమైన చర్యలు తీసుకోక పోవడంతో వారి నిర్లక్ష ధోరణికి విసిగి వేసారి భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు మరియు కాలనీ వాసుల సంపూర్ణ సహకారంతో ఏకమై మమేకమై ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రోడ్డు గుంతలు పూడ్చే పని చేపట్టడం జరిగిందని సంగం శ్రీకాంత్ తెలియ జేసినారు.