ఈరోజు అనగా 27 మే 2023 న శ్రీ టి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే రాజేంద్రనగర్ క్యాంప్ ఆఫీసులో మణికొండ పురపాలక సంఘ పరిధిలో ఉన్న పలు అభివృద్ధి మరియు ప్రజా సమస్యల విషయమై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఫేస్ టు లో భాగంగా రిజర్వాయర్లు నిర్మాణము 80% పూర్తి అవ్వడం మరియు ఇంటింటికి మంచినీరు అందించేందుకు పైప్లైన్ల నిర్మాణం 60 శాతం మేర పూర్తి అవడం జరిగింది. రానున్న రెండు నెలల్లో మిగిలిన పనులు వేగువంతం చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా పలు కాలనీల్లో మరియు బస్తీల్లో మంచినీటి బిల్లులు రెండు సంవత్సరాల గాను ఒక్కసారి జారీ చేయడం సరికాదని, మండు వేసవి కాలం కారణంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఈ సమస్య పరిష్కారం కొరకు రానున్న సోమవారం నాడు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి దాన కిషోర్ గారితో చర్చించి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలపడం జరిగింది. అంతవరకు ప్రజలను ఇబ్బందికి గురి చేయడం సరికాదని అధికారులకు తెలియజేయడం జరిగింది. పంచవటి కాలనీ నుండి ఎస్ ఎన్ డి పి కింద నిర్మితమవుతున్న బాక్స్ డ్రైన్ నిక్నాంపూర్ చెరువు వరకు పొడిగించే విధంగా పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలపడం జరిగింది . నిత్యం రద్దీగా ఉండే ఫ్రెండ్స్ కాలనీ జంక్షన్, ఆంధ్రాబ్యాంక్ జంక్షన్ మరియు మర్రి చెట్టు జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులను నియమించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని నార్సింగ్ మరియు రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ వారిని ఆదేశించడం జరిగింది. పంచవటి కాలనీ నుండి మర్రిచెట్టు వరకు, ఫ్రెండ్స్ కాలనీ నుండి బి ఆర్ సి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగింది, అటులనే రేడియల్ రోడ్లు బి ఆర్ సి నుండి ఓ ఆర్ ఆర్ వరకు మరియు అల్కాపూర్ టౌన్షిప్ నుండి ఓ ఆర్ ఆర్ కి త్వరగా చేపట్టాలని అధికారులకు తెలపడం జరిగింది. మారుతి నగర్ మరియు తిరుమల హిల్స్ లో పార్కుల అభివృద్ధి మరియు అల్కాపూర్ టౌన్షిప్, తానీషా హుడా కాలనీలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కు తెలియజేయడం జరిగింది. అధికారులు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్ మరియు మున్సిపల్ శాఖ వారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అందరికీ సూచించడం జరిగింది .ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డైరెక్టర్ ఆపరేషన్ స్వామి జిఎం రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ కుమార్, నార్సింగి మరియు రాయదుర్గం ట్రాఫిక్ సిఐలు, ఎస్ ఎన్ డి పి, హెచ్ ఆర్ డి సి ఎల్ అధికారులు, బి ఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కార్యదర్శి ఆంజనేయులు, పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.