ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 27 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన మాదాసు రమేష్ అనే 46సంవత్సరాల వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాలలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందతూ మృతి చెందాడు. మృతుడు వ్యవసాయం చేస్తు తనకున్న ఆటో ట్రాలీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోశించుకుంటున్నాడు.మనస్థాపం చెందిన తను ఈనెల 24వ తారీకు రోజు సాయంత్రం తన ఇంటి ముందు కూర్చుని ఆలోచిస్తు పురుగుల మందు త్రాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ తరలించారు. అక్కడ కూడా రమేష్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీనించిందని మంచిర్యాల ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించగా చికిత్స పొందుతూ తేదీ 2023-05-26 రోజున రాత్రి 9.13 నిమిషాలకు చనిపోయాడు. మృతునికి బార్య ఒక కొడుకు ఒక కూతరు ఉన్నారు.మృతుడి బార్య మాదాసు పద్మ పిర్యాదు మేరకు లక్షెట్టిపేట ఎస్సై ఎస్ లక్ష్మణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము అని తెలిపారు.