ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 27 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన గుండారపు శ్రీనివాస్ అనే 22సంవత్సరాల వయస్సు గల యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు లక్షెట్టిపేట ట్రెండ్స్ బట్టల దుకాణంలో ప్రైవేట్ ఎంప్లాయిగా పని చేసుకునేవాడు.మృతునికి ఇంకా పెళ్ళి కాలేదు. తల్లి తండ్రులు పెండ్లి విషయం తీసినప్పుడల్లా కోపగించుకునేవాడు.అందరితో కలుపుగోలుగా ఉండేవాడు కూడా కాదు.తీరిక సమయంలో ఎప్పుడు సెల్ఫోన్లో వీడియోలు చూస్తు కాలయాపన చేసేవాడు. ఈనెల 25వ తేదీ రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చి తిన్న తర్వాత సెల్ఫోన్లో వీడియోలను చూస్తు ఉండగా తల్లితండ్రులు ఎప్పుడు ఫోన్ పట్టుకుని వీడియోలు చూడటమేనా పెండ్లి చేసుకోవా అని అనగా కోపగించుకున్న మృతుడు ఇంట్లోకి వెల్లి పురుగల మందు తాగి బయలకు వచ్చి వాంతులు చేసుకోగా గమనించిన తండ్రి అన్నయ్య ఇద్దరు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరెగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 8.17 నిమిషాలకు చనిపోయాడు మృతుడి తండ్రి గుండారపు మల్లేష్ ఫిర్యాదు మేరకు లక్షెట్టిపేట ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.