నలందల విద్యాసంస్థల చైర్మన్ పి.హెచ్ డి డాక్టర్ రమణ కు శ్రీశ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేసిన ఘనపూర్ గ్రామస్తులు.
మెదక్ తూప్రాన్ న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవాదాయ కమిటీ సభ్యులు
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు, నలందా విశ్వవిద్యాలయ సంస్థల చైర్మన్ డాక్టరేట్ పి.వి రమణ పటేల్ కు , నాయకులు గడ్డం రవీందర్ లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. మున్నూరు కాపు సంఘం నాయకులు ఘనపూర్ గ్రామం ఊరు బాగుకోసం అందరి ఐక్యత కోసం అందరూ చల్లగా ఉండాలని ఉద్దేశంతో శ్రీశ్రీశ్రీ దుర్గామాత ఆలయ నిర్మాణ మందిరం కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన , ఆలయ మందిరం ప్రారంభోత్సవమునకు వివిధ హోదాలో ఉన్న ఎవరైనా సరే మన మహిమగల దుర్గామాత ఆలయం కు సహకరించాలని దాతల సహకారం కావాలని, ఎవరైనా వస్తువు , ధన రూపేనా, ఇవ్వాలని ఆలయ సభ్యుల నంబరు
955329 7746, 9000353689, 9618939359, 7893313909, వారి నెంబర్స్ కాంటాక్ట్ కావాలని ధన రూపేనా వస్తురూపేన సహకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని, ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర యూత్ నాయకులు గడ్డం ప్రశాంత్ కుమార్ లకు ,వివిధ నాయకులకు శ్రీ శ్రీ దుర్గా మాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవములకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం ప్రశాంత్ కుమార్, బద్దం మధుసూదన్ పటేల్, భాస్కర్, బద్దం కిరణ్ కుమార్, శేఖర్, బద్దం మహేష్ పటేల్, మహేష్, ఆలయ కమిటీ సభ్యులు , ఘనపూర్ గ్రామస్తులు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.