ప్రభుత్వ పథకాల పై మంత్రి శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష

 

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 1: గ్రామాలలో సంపద పెంచే దిశగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం రెండవ విడత కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి రెండవ విడత గొర్రెల పంపిణీ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడు భూముల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. .
ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో పాటు తాను కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పర్యవేక్షిస్తున్నానని అందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా అధికారులకు చేస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా 58 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హులైన వారిని గుర్తించడంతో పాటు వారికి పట్టాలను ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపినారు.. అలాగే 59 ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి తాను ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నానని అధికారులు సైతం ప్రత్యేకంగా పర్యవేక్షించినట్లు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని ఈ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking