రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 01 (ప్రజాబలం) కొత్తగూడెం నేషనల్ పంచాయతీ అవార్డ్స్ 2021- 22 సంవత్సరంనకు హెల్దీ పంచాయతీ విభాగంలో రాష్ట్రస్థాయిలో గౌతoపూర్ గ్రామపంచాయతీ ద్వితీయ బహుమతి సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా శనివారం ఎంపిడిఓ రమేష్, ఎంపిఓ సత్యనారాయణ, సర్పంచ్ పోడియం సుజాత, జక్కంపూడి షర్మిల ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతులు మీదుగా సర్టిఫికేట్, షీల్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మార్చి 31న హైదరాబాద్ లోని పి జె టి ఎస్ ఏ యు ఆడిటోరియం రాజేందర్ నగర్ నందు నేషనల్ పంచాయతీ అవార్డ్స్ తీసుకోవడం జరిగిందని చెప్పారు. షీల్డ్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నుండి స్వీకరించబడినట్లు చెప్పారు. ఇంకా ముందు ముందు ఎన్నో రకాల అవార్డులు సాధించాలని, గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు మంచి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈ అవార్డు ద్వారా మీపై మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోడియం సుజాత, జక్కంపుడి షర్మిల పంచాయతీ కార్యదర్శి, సకినాల రమేష్ ఎంపీడీవో గుంటి సత్యనారాయణ ఎంపీ ఓ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking