డాక్టర్ సునిత కు ఎమర్జింగ్ ఫార్మ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

 

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఆన్లైన్ ద్వారా అవసరమైనవారికిమందులను పంపిణీ చేసినందుకు గాను ఎమర్జింగ్ ఫార్మ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను అందుకోవడం సంతోషాన్ని కలిగించిందని డాక్టర్స్ ఫార్మ ఎండి డాక్టర్ సునీత పేర్కొన్నారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్స్ ఫార్మ
ఉద్యోగులుఅవార్డు గ్రహీత డాక్టర్ సునీతను ఘనంగా సన్మానించారు.ఈసందర్భంగాఆమెమాట్లాడుతూ…సేవా కార్యక్రమాలలొ భాగంగా వివిధ వ్యాధుల బారిన పడి ఉపశమనం కోసం వారు వాడుతున్న ఔషధాలవల్లకలిగేదుష్పరిణామాలను ముందుగానే గుర్తించే ఫార్మా కో జెనోమెక్స్ పరీక్షను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దీనిని గుర్తించి తనను అవార్డుకుఎంపికచేయడంగర్వకారణం అన్నారు. ఇండియా ఫార్మా వరల్డ్ అవార్డ్స్ లో భాగంగా ముంబై మహానగరంలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకోవడం జరిగిందనివిశదికరించారు. ఈ అవార్డు తనబాధ్యతను పెంచిందని భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరిపేందుకుప్రోత్సాహాన్నిఇచ్చిందన్నారు.జన్మనిచ్చింది దేవుడైతే ఆరోగ్యాన్ని అందించే డాక్టర్ ను మరో దేవుడిగా తలుస్తారన్నారు. అలాంటి వైద్య వృత్తిలో ఉన్న తాను జీవించినంత కాలంతనవంతుగాసేవాకార్యక్రమాలనునిరాఘాటంగా కొనసాగిస్తాననివెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking