కళ్ళకల్ ఆగష్టు 29 ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్ళకల్ లోని డీకే మెస్ హెచ్.పీ గ్యాస్ వారి ఆధ్వర్యంలో వినియోగదారులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. సుదీర్ఘకాలంగా హెచ్.పీ గ్యాస్ వాడుతున్న వినియోగదారులను గుర్తించి హెచ్.పీ గ్యాస్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిజాంబాద్ సేల్స్ ఏరియా అధికారి మయానక్షర్మ ఆదేశానుసారం సురక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు బహుమతులు ప్రధానం చేసి గ్యాస్ వినియోగంపై అవగాహనకల్పించడం జరిగింది.కార్యక్రమంలో డీకేఎమ్ ఎస్ హెచ్ పి గ్యాస్ సిబ్బంది పాల్గొన్నారు