మన బిన్ ఫౌండేషన్ చైర్మన్ న్యాయవాది ముఖిమ్
సంగారెడ్డి ఆగష్టు 29 ();సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ గారి సతీమణి కోవూరి మణెమ్మను మన బిన్ ఫౌండేషన్ చైర్మన్ న్యాయవాది ముఖిమ్ మర్యాదపూర్వకంగా గౌరవంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మన బిన్ ఫౌండేషన్ చైర్మన్ న్యాయవాది ముఖిమ్ మాట్లాడుతూ ఆనాడు స్వతంత్ర సమరయోధులు కలలు కన్నా రాజ్యం కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసినందుకు వారి ఆశయాలకు అనుగుణంగా కార్యచరణలను నెరవేర్చడంలో , వారికి సంపూర్ణ న్యాయం చేయడంలో ఎప్పుడు ముందుండి పోరాడుతామని , ప్రజల సంక్షేమం కోసమే జీవిస్తామని తెలిపారు..ఈ యొక్క కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుల ఉత్తరాధికారుల అధ్యక్షులు మునిపల్లి రమేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, బి.ఆర్.ఎస్ నాయకులు నవాబు రాజిరెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు పులి సంగప్ప గౌడ్ న్యాయవాది వైభగవంతరావు, టీఎస్ లా న్యూస్ చానల్ ఇంచార్జ్ జి. రమేష్ గౌడ్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జి. శంకర్ గౌడ్ , మున్సిపల్ కౌన్సిలర్ ఇలియాస్ షరీఫ్, జంగిలి అంజయ్య మరియు స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సమితి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.